భీమిలి రిటైర్ట్ ఎమ్మార్‌వో కి జైలు శిక్ష
విశాఖలో పట్టాదార్ పాస్‌బుక్ జారీకి లంచం తీసుకున్నకేసులో భీమిలి రిటైర్డ్ ఎమ్మార్వో సిద్దయ్యకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 2015 ఫిబ్రవరి 9న రూ.15,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన సిద్దయ్యపై విచారణ అనంతరం కోర్టు దోషిగా తేల్చింది. కేసు తీర్పు వెలువడేలోపే ఆయన పదవీ విరమణ పొందారు.