'నిరుపేదలకు పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలి'

'నిరుపేదలకు పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలి'

NLG: అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి ఇంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా నిరుపేదలకు పెన్షన్లు ఇవ్వడం లేదని, దరఖాస్తు చేసుకున్నప్పటికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదన్నారు.