పెట్రోల్ నిల్వలపై భారత్ కీలక ప్రకటన
చమురు నిల్వలపై భారత పెట్రోలియం శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్ దగ్గర 50 రోజులకు సరిపడా చమురు నిల్వలున్నాయని వెల్లడించింది. హర్మూజ్ జలసంధి నుంచి వచ్చేది 40 శాతం మాత్రమేనని తెలిపింది. ఇతర దేశాల నుంచి 60 శాతం దిగుమతి చేసుకుంటున్నామని చెప్పింది. రష్యా సహా వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం భారత్‌పై ఉండదని స్పష్టం చేసింది.