పెంకుటిల్లు దగ్ధం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం
VZM: మెంటాడలో గురువారం అగ్ని జరిగింది. ఈ ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయింది. విద్యుదఘాతంతో మండల సత్యవతికి చెందిన ఇల్లు కాలిపోగా మూడు తులాల బంగారం 70 వేల రూపాయలు నగదు బట్టలు తదితర వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిమాపక కేంద్రం అధికారి ఎం ఎస్ వి రవి ప్రసాద్ సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశారు.