నవోదయ ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థులే టాప్..!

నవోదయ ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థులే టాప్..!

MBNR: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎండి. ఫిరోజ్ 100కు 100 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ పొందగా, ఆర్. నిఖిల్ 7వ ర్యాంక్, కె. అవినాష్ 66వ ర్యాంక్ సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా విద్యార్థులను అభినందించారు.