కర్ణాలవీధిలో ఆంజనేయ స్వామి వారి ఊరేగింపు

నెల్లూరు: గూడూరు పట్టణంలో బుధవారం ఉదయం కర్ణాలవీధి ప్రాంతంలో ఘనంగా వీధి ఊరేగింపును నిర్వహించారు. ప్రజలందరూ జే హనుమాన్, జై శ్రీరామ్ అను నినాదాలతో స్వామి వారిని పూజించుకున్నారు. ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన వడ, తమలపాకుల మాలలు సమర్పించిన అనంతరం టెంకాయలు కొట్టి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.