సామాన్యులకు షాకిచ్చిన ఆకాశ ఎయిర్

సామాన్యులకు షాకిచ్చిన ఆకాశ ఎయిర్

విమాన ప్రయాణికులకు ఆకాశ ఎయిర్ షాక్ ఇచ్చింది. పెరిగిన జెట్ ఇంధన ధరల నేపథ్యంలో ప్రతి టికెట్‌పై రూ.199 నుంచి రూ.1300 వరకు సర్‌ఛార్జీ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఇండిగో, ఎయిరిండియా సంస్థలు ధరలను పెంచగా, తాజాగా ఆకాశ ఎయిర్ కూడా అదే బాటలో చేరింది. దీంతో విమాన ప్రయాణం సామాన్యులకు మరింత భారం కానుంది.