జంగారెడ్డిగూడెంలో 'స్వచ్ఛ ఆంధ్ర పరిశుభ్రత' కార్యక్రమం

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక 10వ సచివాలయం దగ్గర శనివారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 'స్వచ్ఛ ఆంధ్ర పరిశుభ్రత' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలందరూ వారి పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.