ఎలుగుబంటి దాడిలో ఒకరికి గాయాలు
KMR: జిల్లాలో ఎలుగుబంటి దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని రెడ్డిపేట గ్రామ పరిధిలో గల స్కూల్ తండాలో ఓ రైతుపై ఎలుగుబంటి విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.సలావత్ మత్తు (45)అనే రైతు కట్టెల కోసం సమీపంలోని అడవి ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఎలుగుబంటి ఒక్కసారిగా సలావత్ మత్తు పై దాడికి తెగబడింది.