నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ప్రకాశం: కొమరోలు మండలంలో RDSS పనుల్లో భాగంగా పలు గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. రెడ్డిచర్ల సబ్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లె, ఎర్రపల్లెలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలన్నారు.