బంగ్లాదేశ్‌లో బందీగా ఉన్న మత్స్యకారులకు విముక్తి

బంగ్లాదేశ్‌లో బందీగా ఉన్న మత్స్యకారులకు విముక్తి

VSP: బంగ్లాదేశ్‌లో మూడు నెలలుగా బందీగా ఉన్న 9 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు త్వరలో విముక్తి లభించనుంది. ఇంజిన్‌ లోపంతో బోటు అనుకోకుండా బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అక్కడి కోస్ట్ గార్డులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ నిరంతర కృషి, ప్రజాప్రతినిధుల జోక్యంతో విడుదలకు మార్గం సుగమమైంది.