VIDEO: పోచారం ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద

VIDEO: పోచారం ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద

KMR: నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టు జలాశయానికి బుధవారం కూడా వరద కొనసాగింది. నీటిపారుదల శాఖ డీఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్ వాగు ద్వారా 3,904 క్యూసెక్కుల వరద రిజర్వాయర్‌లోకి వస్తోంది. ఇందులో 50 క్యూసెక్కులు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేయగా, మిగిలిన 3,854 క్యూసెక్కుల నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది.