సీఎం రమేశ్ అంటే చీటింగ్, మనీలాండరింగ్: జీవన్ రెడ్డి

NZB: సీఎం రమేష్ అంటే చీటింగ్, మనీలాండరింగ్ అని BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రమేష్ దొంగల ముఠాను తెలంగాణ పొలిమేరకు కూడా దరి చేరనివ్వబోమని, సీఎం రమేష్‌ను హైదరాబాద్‌లో కాలుపెట్టకుండా తరిమికొడతామని హెచ్చరించారు.