హోలీ సంబరాల్లో యువత.. రంగుల మయంగా గ్రామం
RR: హోలీ పండుగ సందర్భంగా నందిగామ మండల కేంద్రంలో హోలీ సంబరాలను వైభవంగా నిర్వహించారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని ఒకరికొకరు రంగులను పూసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా నందిగామ మండల కేంద్రం రంగుల మయంగా మారింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.