వైసీపీని మళ్లీ ఆదరించండి: బుట్టా రేణుకా

వైసీపీని మళ్లీ ఆదరించండి: బుట్టా రేణుకా

కర్నూలు: ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన వైసీపీని మళ్ళీ ఆదరించాలని ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా కోరారు. శనివారం ఉదయం ఆమె పట్టణంలోని గీతానగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమం కొనసాగుతుందన్న విషయాన్ని విస్మరించవద్దని సూచించారు.