నీటి సరఫరా వ్యవస్థ కోసం ఆ ప్రాంతాలే ఎందుకు..?
HYD: నగరంలో జలమండలి నీటి సరఫరా వ్యవస్థ కోసం కోకాపేట్, ఖానాపూర్ పరిసర ప్రాంతాలను ఎంచుకుంది. అయితే, ఇందుకు ముఖ్య కారణం ఈ ప్రాంతాలు సముద్రమట్టానికి +592.00 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. దీంతో ఇక్కడ రిజర్వాయర్ వ్యవస్థను నిర్మించి, కింది ప్రాంతాలకు నీరందిస్తారు. అంతేకాక.. ఇక్కడ ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నట్లు గతంలోనే గుర్తించినట్లు పేర్కొన్నారు.