సొసైటీ ఛైర్మన్ల తొలగింపు పై మాజీ MLA ధర్మారెడ్డి ఆగ్రహం

HNK: పరకాల పట్టణ కేంద్రంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్లతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో చేరలేదనే నెపంతో సొసైటీ ఛైర్మన్లను తొలగించడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.