విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్ రద్దు
VSP: సీపీ కార్యాలయంలో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లలలో, భద్రత చర్యలలో ఉన్నందున పీజీఆర్ఎస్‌ను తాత్కాలికంగా రద్దు చేసామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సీపీ కోరారు. అయితే జీవీఎంసీలో మాత్రం రేపు పీజీఆర్ఎస్ యథావిధిగా కొనసాగుతుంది.