VIDEO: 'పార్కు స్థలంలో ఆక్రమణలు అరికట్టాలి'
VSP: గాజువాక 75వ వార్డు నీలపూ వీధిలో సర్వే నం.79లోని సుమారు రెండు ఎకరాల పార్కు స్థలంలో ప్రైవేటు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై స్థానికులు, కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జీవీఎంసీ రూ.55 లక్షలతో కాంపౌండ్ వాల్, డ్రైన్లు నిర్మించిన ఈ స్థలాన్ని కొందరు వ్యాపారాల కోసం వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు నమ్మి అప్పారావు పాల్గొన్నారు.