పేదింటి బిడ్డకు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన బోడ చంద్రయ్య-ధనలక్ష్మిల కూతురు సంధ్యకు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. పేదింటి బిడ్డకు గురుకులాల ఫలితాల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సంధ్యను మాల మహానాడు ఇండియా ఆఫ్ జాతీయ కార్యదర్శి రెంటల్ కరుణాకర్ ఘనంగా శాలువాతో సన్మానించారు.