నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
VKB: దోమ సబ్ స్టేషన్ పరిధిలోని ఊటుపల్లి, తిమ్మాయిపల్లి, రాకొండ, పోతిరెడ్డిపల్లి గ్రామాల రైతులకు విద్యుత్ అంతరాయం కలుగుతుంది. 11కె.వీ కొత్తలైన్ వేయడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ EE వినయ్ కాంత్ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ ఉండదని చెప్పారు. రైతులు, గృహ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.