కుటుంబ కలహాలతో యువకుడు మృతి
NLR: అనంతసాగరంలో సోమవారం కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వడ్లపల్లి పెంచలయ్య (30) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్యతో విభేదాలు, కుటుంబ ఆస్తి తగాదాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.