రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల ధర్నా

రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల ధర్నా

SRD:పటాన్‌చెరు మండలం లక్డారం రోడ్డును బాగుపరచాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు బుధవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కంకర క్రషర్ల వద్దకు నిత్యం వెళ్లే టిప్పర్లతో రోడ్లు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోడ్డుపై కంకర్ టిప్పర్లు ఓవర్ లోడుతో వెళ్లడం వల్లనే రోడ్డుకు ఈ గతి పట్టిందన్నారు. వెంటనే రోడ్డును బాగుచేయాలని డిమాండ్ చేశారు.