ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: తహశీల్దార్

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: తహశీల్దార్

గుంటూరు: పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులోని రైతు సేవా కేంద్రాన్ని తహశీల్దార్ జియావుల్ హక్ ఆదివారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సిబ్బందినీ అడిగి తెలుసుకొని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. రికార్డులు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, కేంద్రం ద్వారా గిట్టుబాటు ధరకు ధాన్యం విక్రయించుకోవచ్చని తెలిపారు.