అలర్ట్.. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అలర్ట్.. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

SKLM: LPG గ్యాస్ సిలిండర్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్రీ గ్యాస్ సబ్సిడీ, KYC అప్డేట్ పేరుతో వచ్చే కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని, OTP, బ్యాంక్, ఆధార్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొంది. గ్యాస్ సేవల కోసం అధికారిక యాప్, వెబ్‌‌సైట్ మాత్రమే ఉపయోగించాలని కోరింది.