కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి: జగన్

కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి: జగన్

MBNR: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలందరికీ వెంటనే డబ్బులు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జగన్ డిమాండ్ చేశారు. మంగళవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో గీతాంజలికి అందజేశారు.