ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
SKLM: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పలాసలోని ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే శిరీష శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మత సామరస్యాన్ని పెంపొందిస్తూ అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.