వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

ప్రకాశం: కనిగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు అవసరమయ్యే ఎరువులు, పురుగుమందులు సరిపడినంత అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు సాగు చేసే పంటలపై ఎప్పటికప్పుడు వారికి సూచనలు, సలహాలు అందించాలని తెలియజేశారు.