'చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు'

NLG: వేసవిలో చోరీల నివారణకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి ఆదివారం తెలిపారు. వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారు ఇంట్లో నగలు ఉంచవద్దని సూచించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఊరికి వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.