VIDEO: రహదారిపై ప్రమాదాల నివారణకు ఎమ్మెల్యే పరిశీలన
హన్మకొండ వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ నుంచి ఉనికిచెర్ల మార్గంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పోలీస్ అధికారులతో కలిసి రహదారిని క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని తెలిపారు.