ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్
KRNL: కర్నూలు కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయ సేవసదన్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి ఈ నెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌పై ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా వివిధ కేసులను పరస్పర ఒప్పందంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.