'బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి'
AKP: గ్రామస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సూచించారు. మంగళవారం అనకాపల్లి మండలం లక్ష్మీదేవిపేట మార్టూరు గ్రామాల్లో మన ఊరు-మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అనకాపల్లి జిల్లాకు భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు.