చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు

చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు

KMR: బీర్కూర్ (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. దామరంచ గ్రామానికి చెందిన నర్సింహులు ఇవాళ చేప‌ల వేట‌కు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికుల స‌మాచారం మేరకు డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్, ఎస్సై మహేందర్ ఘటన స్థలానికి వెళ్ళి గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టారు. యువకుడి ఆచూకీ ఇంతవరకు లభించలేదని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.