'ట్రాఫిక్ సమస్యపై చర్యలు తీసుకోవాలి'

'ట్రాఫిక్ సమస్యపై చర్యలు తీసుకోవాలి'

ELR: ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు వాహనాలను రోడ్డు మధ్యలో నిలుపుదల చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.