జిల్లాలో రేషన్ ఈ కేవైసీ ఎంతమంది చేసుకున్నారంటే ?

ప్రకాశం: రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. మే నెల నుంచి ఈకేవైసీ చేసుకున్న వారికే రేషన్ ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే ఏప్రిల్ 30 గడువు ముగిసేందుకు దగ్గరపడుతున్నా జిల్లాలో ఇంకా 1.22 లక్షల మంది లబ్దిదారులు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇప్పటివరకు 83,389 మంది మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారు.