జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్
కేంద్రీయ విద్యాసంస్థల్లోని యూజీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదలయింది. మొదటి సెషన్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 మధ్య నిర్వహించనుంది. NIT, IIITల్లో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష జరగనుంది. విద్యార్థుల సౌకర్యార్థం JEE మెయిన్ పరీక్షను రెండు సేషన్లలో నిర్వహిస్తున్నారు.