'బర్త్‌ సర్టిఫికెట్ల గడువుపై ఆ దుష్ప్రచారం నమ్మొద్దు'

'బర్త్‌ సర్టిఫికెట్ల గడువుపై ఆ దుష్ప్రచారం నమ్మొద్దు'

బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు 2026 ఏప్రిల్ 27తో గడువు ముగుస్తోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. వాట్సాప్‌లో ప్రచారం అవుతున్న ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించింది. జనన ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి కేంద్రం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని వెల్లడించింది.