VIDEO: వరంగల్ డీసీసీ అధ్యక్షుడికి సన్మానం
వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన మహ్మద్ అయ్యుబ్‌ను నగరానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఉదయం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అయ్యుబ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.