' జిల్లాలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరుపుకోవాలి'

MHBD: జిల్లా వ్యాప్తంగా వినాయకచవితి నుంచి గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈనెల 5వ తేదీన జరగనున్న నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా మరింత భక్తిపూర్వక వాతావరణంలో, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ ప్రజలకు, వినాయక మండపాల నిర్వాహకులకు పిలుపునిచ్చారు.