కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఆత్మహత్య

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వక్కలగడ్డ అర్జునరావు అనే వృద్ధుడు ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అర్జునరావు గతకొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి తీవ్రతరం కావడవతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.