చౌదర్పల్లి సర్పంచ్ ఏకగ్రీవం
NGKL: వెల్దండ మండలంలోని చౌదర్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. గ్రామానికి చెందిన సుంకిరెడ్డి కృష్ణారెడ్డి సర్పంచిగా ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవికి మొత్తం ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయగా, బుధవారం నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా మిగిలిన అభ్యర్థులు పత్రాలను వెనక్కి తీసుకున్నారు. కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.