జిల్లాలో తనిఖీలు కఠినతరం చేయాలి:సీతక్క
MLG: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించి, క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. డ్రైవింగ్ రాకపోయినా, లైసెన్స్ లేకపోయినా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు ములుగు జిల్లాలో తనిఖీలు కఠినతరం చేయాలన్నారు.