విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే
పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి రోహిత్‌ను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో శాలువతో సత్కరించారు. ఈనెల 5న ఢిల్లీ వెళ్లిన రోహిత్ రాకెట్ సైన్స్, ఏరో నాటికల్ విభాగాల్లో ప్రతిభ కనపర్చి అక్కడ అందరిని ఆకట్టుకున్నారు. ఇలాగే మరెన్నో ఉన్నత శిఖరాలు అదిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.