జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా రమేష్ గౌడ్ ఎన్నిక
WGL: నర్సంపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అనంతుల రమేష్ గౌడ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వరంగల్ శివనగర్ సాయి ఫంక్షన్ హాల్‌లో జరిగిన TWJF 3వ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరంతరం జర్నలిస్ట్ హక్కుల కోసం పోరటం చేస్తానని ఎన్నికలకు సహకరించిన సీనియర్ జర్నలిస్టులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.