నేడు హిందూపురానికి వరుదు కళ్యాణి రాక..!
SS: హిందూపురంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా స్థాయి వైసీపీ మహిళా విభాగం ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హాజరుకానున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక కోరారు.