VIDEO: ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

HNK: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో పటిష్ట భద్రత పర్యవేక్షణలో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూములను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం తనిఖీ నిర్వహించారు. రికార్డుల నిర్వహణ గురించి ఎన్నికల విభాగం అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు.