జిల్లాలో మహిళలదే తుది నిర్ణయం.!
నంద్యాల జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషులను మించడంతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. 10,84,706 మంది ఓటర్లలో పురుషులు 5,33,161 మంది, మహిళలు 5,51,420 మంది, ఇతరులు 125 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు అధికంగా ఉండటం వల్ల రానున్న ఎన్నికల్లో వారి నిర్ణయం ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.