VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం
WGL: పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం పెంకుటిల్లు కాలిపోయింది. బాధితుడు బానోత్ జనార్ధన్ కుటుంబం పనులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగడంతో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లో మెయిన్ వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో 2 క్వింటాళ్ల బియ్యం, బంగారు–వెండి నగలు, సర్టిఫికెట్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.1 లక్ష ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.