వినాయకునికి పీఓ ప్రత్యేక పూజలు

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని సమగ్ర గిరిజన సంస్థ కార్యాలయ వసతి గృహాల వారు ఏర్పాటు చేసిన గణనాథుని మండపాన్ని గురువారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రులను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారని, నిమజ్జనాన్ని ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.