స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అందని జీతాలు

VSP: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మూడో తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా ప్రతినెల జీతంలో 75% మాత్రమే చెల్లిస్తున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు మూడు రెట్ల జీతం యాజమాన్యం బకాయి పడిందన్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.